AP: సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తో భేటీ అయిన తోట

కాకినాడ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కరరెడ్డిని మంగ‌ళ‌వారం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మర్యాదపూర్వకంగా కాకినాడలో ఆయన స్వగృహంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం భాస్కర్ రెడ్డితో త్రిమూర్తులు కొంతసేపు జిల్లాలోని రైతులు మిల్లర్స్ మస్యలపై చర్చించారు.

ఎస్ పి ని కలిసిన తోట

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన ఎం రవీంద్రనాథ్ బాబును ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాకినాడ ఎస్పీ కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూల బొకే ఇచ్చే ఎస్పీ కి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాకు ఎస్పీగా రావడం అదృష్టమని జిల్లాలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావివ్వకుండా బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.