త‌ణుకులో‌ కారు బోల్తా.. ముగ్గురు మృతి

త‌ణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం తణుకు సమీపంలో ఓ కారు అదపు తప్పి పంట కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు మరణించారు. వివరాల ప్రకారం.. తణుకులో ప్రభుత్వ విధుల నిమిత్తం కారులో బయలుదేరారు. వర్షం కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆంధ్రా చక్కెర కర్మాగారం సమీపంలోని ఒక పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అధికారులు అక్కడికక్కడే మరణించారు. శేఖర్‌ తణుకు మునిసిపల్‌ కార్యాలయంలో, సుభాషిణి ఉండ్రాజవరంలోని వెలుగు కార్యాలయంలో, శ్రీనివాస్‌ తణుకు ఆర్‌డిఎ కార్యాలయంలోనూ పనిచేస్తున్నపట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసి విచార‌ణ చేస్తున్నారు. విచార‌ణ అనంత‌రం పూర్తివివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.

తణుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన‌ శ్రీను, జీవన శేఖర్, సుభాషిణి

Leave A Reply

Your email address will not be published.