AP: రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఈనెల ఆగస్టు 14 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు అందినవి. రాష్ట్రంలో గడిచిన 24 గంటలలో 2,107 మంది కరోనా బారిన పడ్డారు. 20 మంది ప్రాణాలు కోల్పోయారు.