CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ (CLiC2NEWS): సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలు (CBSE) మంగళవారం విడుదలయ్యాయి. జూలై 30న 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన బోర్డు ఇవాళ 10వ తరగతి ఫలితాలను కూడా వెల్లడించింది. ఫలితాల కోసం విద్యార్థులు cbse.nic.in, cbse results.nic.in వెబ్‌సైట్‌లను సంప్రదించవచ్చని బోర్డు సూచించింది. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్ నెంబర్‌తో పాటు స్కూల్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
కాగా, మొత్తం 21.5 లక్షల మంది విద్యార్థులు CBSE 10వ తరగతి పరీక్షలు రాయగా వారిలో 99.04 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది నమోదైన ఉత్తీర్ణతా శాతంతో పోల్చితే ఇది దాదాపు 8 % ఎక్కువ. తాజా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలుర కంటే బాలికలు 0.35 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. బాలురు 98.89 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 99.24 శాతం ఉత్తీర్ణులయ్యారు.