India Corona: భారీగా పెరిగిన కొత్త కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24గంటల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 42,625 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయయి. ఈ మేర‌కు బుధ‌వారం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజాగా నమోదైన కేసులతో క‌లిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,17,69,132 కు పెరిగింది.
  • తాజాగా కరోనా బారి నుండి 26,668 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి దేశంలో మొత్తం వరకు 3,09,33,022 మంది కోలుకున్నారు.
  • మరో వైపు 562 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి దేశంలో వైరస్‌ బారినపడి మొత్తం 4,25,757 మంది మృత్యువాతపడ్డారు.
  • ప్రస్తుతం దేశంలో 4,10,353 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
  • దేశంలో ఇప్పటి వరకు 47.31 కోట్ల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.

టీకా డ్రైవ్‌లో భాగంగా మొత్తం 48,52,86,570 టీకా మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.