Central Mali: రోడ్డు ప్రమాదంలో 41 మంది మృతి

బమాకో (CLiC2NEWS): ఆఫ్రికా దేశమైన మాలీలో దక్షిణ మధ్య మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 41 మంది ప్రయాణికులు మరణించారు. దీనిపై ఆ దేశ రవాణా మంత్రి మాట్లాడుతూ… కార్మికులతో వెళ్తున్న ట్రక్కు, ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో టైర్ పేలడంతో ట్రక్కు అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. సెగౌ పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఘటన చోటు చేసుకున్నది. ట్రక్కు బలంగా డీకొట్టడంతో ప్రయాణికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో 33 మంది గాయపడ్డారని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యార్తు చేస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.