జ‌ల‌మండ‌లి కార్మికులకు మురుగునీటి నిర్వ‌హ‌ణ‌, భ‌ద్ర‌త పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

ఆగ‌ష్టు 16 నుండి 30 వ‌ర‌కు, ప‌క్షం రోజుల పాటునిర్వ‌హ‌ణ‌.

డివిజ‌న్ కు ఒక అత్యంత నైపుణ్యం గ‌ల టీమ్.

ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఉన్న‌తాధికారుల‌తో కూడిన ప్ర‌త్యేక క‌మిటీ.

జ‌ల‌మండ‌లి ప‌రిధిలో ప‌నిచేస్తున్న పారిశుధ్య కార్మికుల‌కు మురుగునీటి నిర్వ‌హ‌ణ‌ మ‌రియు భ‌ద్ర‌త పై ప‌క్షం రోజుల పాటు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు జ‌ల‌మండ‌లి ఎండీ. శ్రీ‌. ఎం. దాన కిశోర్, ఐఏఎస్ తెలిపారు. తేది:12.08.2021, గురువారం నాడు జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఉన్న‌తాధికారులతో స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జ‌ల‌మండ‌లిలో ప‌నిచేస్తున్న‌ సీవ‌రేజి కార్మికులకు మురుగునీటి నిర్వ‌హ‌ణ, భ‌ద్ర‌తపై ఆగ‌ష్టు 16 నుండి 30 వ‌ర‌కు, ప‌క్షం రోజులు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో కార్మికుల‌కు మురుగునీటి నిర్వ‌హ‌ణ లో చేయాల్సిన‌, చేయ‌కూడ‌ని ప‌నులు, భ‌ద్ర‌తా ప‌రిక‌రాల ప‌నితీరు, పారిశుధ్యం ప‌నులు చేప‌ట్టే స‌మ‌యంలో అవ‌లంబించాల్సిన ప‌ద్ద‌తుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్నట్లు వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో పారిశుధ్యం ప‌నుల్లో ఎస్వోపి (స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్) గైడ్ లైన్స్ అమ‌లు పై, భ‌ద్రతా ప‌రిక‌రాల ప‌నితీరు, వాటిని ఉప‌యోగించే విధానం, మ్యాన్ హోళ్ళ‌ను శుద్ధి చేసేట‌ప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లతో పాటు విధి నిర్వ‌హ‌ణ‌లో ఏదైనా ప్ర‌మాదం సంభ‌వించిన‌పుడు చేసే ప్ర‌థ‌మ చికిత్స వంటి అంశాల‌పై అవ‌గాహ‌న కల్పించ‌నున్నారు. కార్మికులు విధి నిర్వ‌హ‌ణ‌లో త‌ప్ప‌కుండా హ్యండ్ గ్లౌజులు, గ‌మ్ బూట్స్, మాస్కులు, బాడీ సూట్ వంటి భ‌ద్ర‌తా ప‌రిక‌రాల‌ను ధ‌రించేలాగా ప్ర‌తీ మేనేజ‌ర్ త‌మ సెక్ష‌న్ ప‌రిధిలోని సీవ‌రేజి కార్మికులంద‌రికి ఒక రోజు శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని ఆదేశించారు.

ఈ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో ప్ర‌తీ డివిజ‌న్ కు అత్యంత నైపుణ్యం గ‌ల కార్మికుల‌ను గుర్తించి వారితో ఒక టీమ్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా తెలిపారు. వీరు ఆయా ప్రాంతాల్లోని స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో జ‌రిగే సీవ‌రేజి ప‌నుల్లో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఆ ప‌నిని పూర్తి చేస్తారని, ఈ టీమ్ డీజీఎం ఆధ్వ‌ర్యంలో ప‌నిచేస్తుంద‌ని వివ‌రించారు. అంతేకాకుండా ఈ ప‌నులు స‌క్ర‌మంగా జ‌రుగడానికి ఒక “ సోష‌ల్ ఆడిట్ టీమ్” కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. వీరు ఆయా సంద‌ర్భాల్లో జ‌రుగుతున్న మురుగునీటి నిర్వ‌హ‌ణ ప‌నులును త‌నిఖీ చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక అందిస్తార‌ని పేర్కొన్నారు.

రానున్న ఈ 15 రోజుల పాటు జరిగే ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షించ‌డానికి జ‌ల‌మండ‌లి ఉన్న‌తాధికారుల‌తో కూడిన ఒక క‌మిటీని నియ‌మిస్తున్న‌ట్లు తెలిపారు. వీరు ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప‌నులు, తీరుతెన్నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపారు.

కేవ‌లం కార్మికుల‌కే కాకుండా వినియోగ‌దారుల‌కు మ్యాన్ హోళ్ళ‌ను తెర‌వ‌కుండా, మ్యాన్ హోళ్ళ‌ల్లో చెత్త చెదారం వేయ‌కుండా ఉండేందుకు అవ‌గాహ‌న కల్పంచాని వెల్ల‌డించారు. దీనికోసం క‌ర‌ప‌త్రాలను ముద్రించి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అన్నారు. అంతే కాకుండా ఇందులో ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను, స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను, జ‌ల‌మండ‌లి లో ఉన్న ప‌లు యూనియ‌న్ ల‌ను కూడా భాగ‌స్వామ్యం చేయాల‌ని సూచించారు. అంతే కాకుండా భారీ, మినీ జెట్టింగ్ మిష‌న్ల య‌జ‌మానుల‌కు మ‌రియు ఆప‌రేటర్ల‌కు కూడా జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఒక రోజు శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో జ‌ల‌మండ‌లి ఈఎన్సీ, డైరెక్ట‌ర్ ఆప‌రేష‌న్స్-1 అజ్మీరా కృష్ణ‌, చీఫ్ విజిలెన్స్ ఆఫీస‌ర్ ర‌విచంద్ర‌న్ రెడ్డి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజ‌ర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.