భార‌త్ గ‌ర్వ‌ప‌డేలా చేశారు..

ఒలింపిక్స్‌ వీరుల‌కు రాష్ట్రప‌తి తేనీటి విందు

న్యూఢిల్లీ (CLiC2NEWS): టోక్కో ఒలింపిక్స్‌లో పోటీప‌డిన దేశానికి చెందిన క్రీగాకారుల‌కు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ శ‌నివారం సాయంత్రం తేనీటి విందును ఇచ్చారు. ఇవాళ క్రీడాకారుల‌ను రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు ఆహ్వానించి వారికి అభినంద‌న‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్రప‌తి మాట్లాడుతూ.. ఒలింపిక్ అథ్లెట్ల‌ను చూసి భార‌త్ గ‌ర్వ‌ప‌డుతోంద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళాక్రీడాకారుల‌పై రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు కురిపించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌ద‌ర్శ‌న చేశార‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు, కేంద్ర‌క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.