విజయనగరంలో భారీగా గంజాయి పట్టివేత

విజయనగరం : విజయనగరం జిల్లా పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం కొమరాడ పోలీసులు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. అరకు నుంచి ఒడిశాలోని రాయగడకు అక్రమంగా లారీలో తరలిపోతున్న గంజాయిని గుర్తించామన్నారు. ఈరోజు ఉదయం కొమరాడ రహదారి వద్ద గోతుల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవటంతో ఓ లారీలో గంజాయిని గుర్తించామని చెప్పారు. పార్వతీపురం వైపు నుంచి రాయగడ రోడ్డు మీదుగా అక్రమంగా లారీలో తరలిస్తున్న సుమారు కోటి 20 లక్షల రూపాయల విలువ చేసే 675 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణ దర్యాప్తు అనంతరం కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.