TS: 18 ఏళ్ళు నిండిన ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం 18 ఏళ్ళు నిండిన వారందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. చీరలు పంపిణీ చేయడానికి వీలుగా జిల్లాలకు సరుకులను పంపించే ప్రక్రియను ఆదివారం నుండి ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో జిహెచ్ఎంసి కమిషనర్, జిల్లాలలో కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.పంపిణీ తర్వాత మిగిలిన చీరలను గోడౌన్‌లకు అక్టోబరు 31తేదీలోగా చేర్చాలని ఆదేశించింది.