చెన్నూరులో మొదలైన బిజెపి మహాపాదయాత్ర..
చెన్నూరు (CLiC2NEWS): కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలంటూ చెన్నూరు నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి అందుగుల శ్రీనివాస్ చేపట్టిన పాదయాత్ర మంచిర్యాల కలెక్టరేట్ వరకు కొనసాగనుంది. ఈ మహాపాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం అక్కడ జరిగిన సభలో వివేక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కానీ అభివృద్ధి కాని పరిస్థితి ఇప్పడు తెలంగాణ రాష్ట్రంలో ఉందని వివేక్ పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాల్క సుమన్ వెంటనే రిజైన్ చేయాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. సుమన్ రిజైన్ చేస్తే.. బీజేపీ తరఫున అభ్యర్థిని కూడా పోటీలో పెట్టబోమని ఈ సందర్భంగా వివేక్ స్పష్టం చేశారు. కాగా అందుగుల శ్రీనివాస్ చేపట్టిన ఈ మహాపాదయాత్ర మంచిర్యాల కలెక్టరేట్ వరకు కొనసాగనుంది.