సుందరయ్య పార్కులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే
హైదరాబాద్ (CLiC2NEWS): గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో ఇవాళ (సోమవారం) ఎమ్మెల్యే మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ముఠాగోపాల్ పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్‌కుమార్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని గుర్తుచేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా విజయవంతంగా కొనసాగుతుందని, ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సెలబ్రెటీల నుంచి సాధరణ జనం వరకు ఇందులో పాలుపంచుకుంటున్నారు.