Mancherial: `రైట్ టు సిట్ – కూర్చునే హక్కు`ని అమలు చేయండి..

ఛాంబర్ ఆఫ్ కామర్స్ మంచిర్యాల  జిల్లా ప్రెసిడెంట్ గుండా సుధాకర్ కి వినతి పత్రం అంద‌జేత‌

మంచిర్యాల (CLiC2NEWS): “ఫోరం ఫర్ రైట్ టు – సిట్ యాక్ట్” పని చేసే చోట కూర్చునే హక్కు గురించి మంగ‌ళ‌వారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మంచిర్యాల  జిల్లా ప్రెసిడెంట్ గుండా సుధాకర్ కి  ఫోరమ్ ఫర్ రైట్ టు -సిట్ యాక్ట్` స‌భ్యులు వినతి పత్రం అంద‌జేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని  షాపింగ్ మాల్స్ లలో పనిచేస్తున్న మహిళలు దాదాపు  పది నుంచి పన్నెండు గంటలు నిల్చొని  పనిచేయాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు.  అలా నిల‌బ‌డ‌టంతో మహిళా ఉద్యోగులు అనేక రకాల అనారోగ్య సమస్యలకు గుర‌వుతున్నార‌ని పేర్కొన్నారు.

ఇప్ప‌టికే ద‌క్షిణ భార‌తంలోని  కేరళ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు “రైట్ టు -సిట్ యాక్ట్” కూర్చునే చట్టాన్ని తీసుకొచ్చాయని తెలిపారు.  ఈ రాష్ట్రాల్లో మాదిరి తెలంగాణ‌లో కూడా  రైట్ టు సిట్ యాక్టు అమలు కావాల్సిన అవసరం వుందని స‌భ్యులు గుర్తు చేశారు.

దాని అమలు కోసం జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా జిల్లాలోని అన్ని వ్యాపార సముధాయాల యజమానులతో చర్చించి ఉద్యోగులకు , కార్మికులకు మాల్స్ , షాపులల్లో కూర్చోవడానికి సీట్స్ , స్టూల్స్ ఏర్పాటు చేసే విధంగా  చర్యలు తీసుకోవలసిందిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గుండా సుధాకర్  కి విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

ఈ కార్యక్రమంలో “ఫోరమ్ ఫర్ రైట్ టు -సిట్ యాక్ట్” మంచిర్యాల సభ్యులు స్త్రీవాద క‌వయిత్రి బొలిశెట్టి పద్మజ, స్వాతి, కథ రచయితా అల్లాడి శ్రీనివాస్, యువ కవి బొలిషెట్టి నాగేంద్ర, పెద్దిభరత్ , సామాజిక కార్యకర్తలు AAP జిల్లా అధ్యక్షులు నల్లా నాగేంద్ర ప్రసాద్, ఛత్రపతి సాహు స్టడీ సర్కిల్ అధ్యక్షుడు కుడుదుల శ్రీనివాస్, శివ, తిలక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.