నిమ్స్ లో  ఘనంగా బతుకమ్మ వేడుకలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్‌లోని నిమ్స్ ఆసుప‌త్రిలో బ‌తుక‌మ్మ వేడుక‌లు ఘ‌నంగా నిర్వహిస్తున్నారు. ప్ర‌తీ ఏడాది లాగే ఈ సంవ‌త్స‌రం కూడా స‌ద్దుల బ‌తుక‌మ్మ ఉత్స‌వాల కోసం ఏర్పాట్లు ఘ‌నంగా చేశారు. నిమ్స్ లైజ‌ర్ ఆఫీస‌ర్ డాక్టర్ మార్త రమేష్ నిమ్స్ లో బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..

సమైక్య పాలనలో బతుకమ్మ పండుగ కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది అనీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగగా గుర్తింపు వచ్చింది అని, నిమ్స్ లో మహిళా ఉద్యోగులు ప్రతిరోజు ఎంతో కష్టపడి పని చేస్తూ మానసికంగా ఒత్తిడికి గురవుతారు అని,  వారందరికీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం కొరకు బతుకమ్మ వేడుకలు మహిళల కొరకు ప్రత్యేకంగా చొరవ తీసుకొని నిర్వ‌హించ‌డం ఎంతో గర్వంగా ఉంటుందని తెలిపారు. నా సొంత అక్కాచెల్లెళ్లకు చిన్నప్పుడు పూలు తెచ్చి ఇచ్చినట్టు ఇప్పుడు మహిళా ఉద్యోగులకు అన్ని ఏర్పాటు చేయడం అన్నయ్యవలె, గర్వంగా ఉందని ర‌మేష్ తెలిపారు.

తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కనకతార  మాట్లాడుతూ..
మహిళలకు ఏ కార్యాలయంలో కూడా దొరకనంత గౌరవం నిమ్స్ లో  దొరుకుతుందని పేర్కొన్నారు. ఎంత కష్టపడి పని చేసిన ఇలాంటి సమయంలో సరైన గౌరవం సరైన గుర్తింపు లభించడం వలన కష్టాలన్నీ మర్చిపోయి మహిళా సోదరీమణులు అందరు కూడా ఆనందంగా ఇంకా ఎంతో ఉత్సాహంతో పనిచేస్తారు అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, అధికారులకు, మా తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళా వైద్యులు, మహిళా ఉద్యోగులు రాధిక, ఆశాలత వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థినిలు, నిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.