కామారెడ్డిలో బిజెపి ర్యాలీ
కామారెడ్డి: బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆశ పెట్టి పేదలను మోసం చేయటమే కాకుండా ఎల్ఆర్ఎస్ పేరు మీద పేద, మధ్య తరగతి ప్రజల రక్తం జలగ లెక్క పీలుస్తున్న కేసీఆర్ ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా ఈ రోజు మంగళవారం కామారెడ్డిలో బిజెపి నాయకులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి పోలిసులు అడ్డుకున్నప్పటికి జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్మారెడ్డి మాట్లాడుతూ కరోనా సమయాన ఇంటి అద్దె అడిగితే జైలుకు పంపిస్తా ముఖ్యమంత్రి నేడు కరోనా తో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న పేద మధ్య తరగతి ప్రజలు కష్టపడి కొన్న ప్లాటుకు గడువు లోపు ఎల్ఆర్ఎస్ కట్టుకోక పోతే అక్రమమైనవి గా గుర్తించాల్సి వస్తుంది అంటూ బెదిరిస్తున్నారని, అసెంబ్లీలో కెటిఆర్ చట్టం లో మార్పు చేస్తామని చెప్పినప్పటికీ దాని ద్వారా పేదలకు ఎలాంటి ఉపశనం కలగ లేదని అన్నారు. పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం వెంటనే రద్దు చేయాలని అన్నారు. అదే విధంగా పేదల సొంత ఇంటి కల తీరాలని ప్రధాని మోదీ గారు ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కార్యక్రమాన్ని కాదని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లు నిర్మించి ఇస్తామని 6 ఏళ్లుగా మభ్యపెట్టడమే తప్ప జిల్లాలో ఇప్పటికి 1000 మందికి కూడా ఇవ్వలేదని ప్రభుత్వం వెంటనే అర్హులైన పెద్ద ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బాణాల లక్మరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నారాజులు,పట్టణ అధ్యక్షుడు భానుప్రకాశ్, పట్టణ కౌన్సిలరులు,వివిధ మండల అధ్యక్షులు, బిజెవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు