AP: చెరువులో పడిపోయిన స్కూల్ బస్సు
ఆరేళ్ల బాలుడు మృతి
ఎచ్చెర్ల (CLiC2NEWS) : శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలంలో ఓప్రైవేటు స్కూల్ బస్సు చెరువులో బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించాడు. పాఠశాలకు వెళుతుండగా కొయ్యం పంచాయితీ నిమ్మవాని పేట సమీపంలోని నల్లచెరువు వద్ద బస్సు అదుపు తప్పి చెరువులో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకొని క్రేన్ సహాయంతో బస్సును, అందులో ఇరుక్కుపోయిన చిన్నారి మృత దేహాన్ని బయటకు తీశారు.