నిజామాబాద్‌లో లారీని ఢీకొన్న కారు.. ఒకరి మృతి
నిజామాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు టైరు పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ మృతిచెందారు… ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాయపడిన వారిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతుడిని మోర్తాడ్ మండలం పాలెం వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.