TS: హెల్మెట్లు ధ‌రించి వైద్యుల వినూత్న నిర‌స‌న‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS) : ఉస్మానియా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో పిజి విద్యార్థులు హెల్మెట్ ధ‌‌రించి వినూత్నంగా నిరస‌న తెలిపారు. ఒక వైద్య విద్యార్ధినిపై ఫ్యాన్ విరిగి ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఆమెకు స్వ‌ల్ప గాయాలు కావ‌టంతో వైద్య‌ విద్యార్థులు కొద్దిసేపు మౌన దీక్ష చేప‌ట్టారు. అనంత‌రం సూప‌రెండెంట్‌‌కి ఫిర్యాదు చేశారు. ఉస్మానియా రోగులు, వైద్య సిబ్బందికి ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని జూడాలు ఆరోపించారు. పిజి విద్యార్థులు హెల్మెట్ ధ‌‌రించి నిరస‌న తెలిపారు. ఆస్ప‌త్రిలో సీలింగ్ ఫ్యాన్‌లు చూసి ఆంధోళ‌న‌కు గురౌతున్నామ‌ని అన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.