సిఎంను కలిసిన వైఎస్సార్ ‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాపారాయుడు

మండపేట (CLiC2NEWS): రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సిఎంకు సీతారామాంజనేయ స్వామివార్ల కొండపల్లి బొమ్మలను బహూకరించారు. ఈ సందర్భంగా కొంతసేపు తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై చర్చించారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని తెలిపారు. త్వరలో రహదారులు పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని సిఎం చెప్పినట్లు పాపారాయుడు మీడియాకు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.