ప‌సిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. పండగ సీజన్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఈ రోజు (మంగ‌ళ‌వారం) ధంతేరాస్‌. ఇవాళ బంగారం కొనేందుకు ప‌సిడి ప్రియులు ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే ధంతేరాస్‌ రోజు బంగారం, వెండి కొంటే అంతా మంచి జరుగుతుందని విశ్వాసం. కాగా బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ పండగ సీజన్‌లో బంగారం.. ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తాజాగా పసిడి ధరలు పరుగులు పెట్టి.. నిన్నటి (సోమ‌వారం) నుంచి బ్రేకులు పడ్డాయి.

ఈ రోజు ధంతేరాస్‌. ఈ నేపథ్యంలో తాజాగా న‌వంబ‌ర్ ‌2న మంగళవారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వాటి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. పండుగ వేళ గ‌త రెండు రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌ల్లో మార్పులు లేక‌పోవ‌డం ప‌సిడి ప్రియుల‌కు నిజంగా శుభ‌వార్తే.

  • దేశీయంగా బంగారం ధ‌ర‌లు చూస్తే…
    22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,740
    24 క్యారెట్ల బంగారం ధర రూ.47,740గా వద్ద కొనసాగుతోంది.

ఇవాళ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు

  • హైదరాబాద్‌:
    22 క్యారెట్ల 10 గ్రాములు రూ.44,700
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.48,770
  • విజయవాడ:
    22 క్యారెట్ల 10 గ్రాములు రూ.44,700
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.48,770
  • విశాఖపట్నం:
    22 క్యారెట్ల 10 గ్రాములు రూ.44,700
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.48,770
  • ముంబ‌యి:
    22 క్యారెట్ల 10 గ్రాములు రూ.46,740
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.47,740
  • ఢిల్లీ:
    22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.46,850
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100
  • చెన్నై:
    22 క్యారెట్ల 10 గ్రాములు రూ.45,010
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.49,110
  • కోల్‌కతా:
    22 క్యారెట్ల 10 గ్రాములు రూ.47,150
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.49,850
  • బెంగళూరు:
    22 క్యారెట్ల 10 గ్రాములు రూ.44,700
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.48,770
  • కేరళ:
    22 క్యారెట్ల 10 గ్రాములు రూ.44,700
    24 క్యారెట్ల 10 గ్రాములు రూ.48,770

పైన పేర్కొన్న‌ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. బంగారం, వెండి ధ‌ర‌ల్లో ఎప్పటికప్పుడు మార్పులు ఉండే అవకాశం ఉంటుందని గ‌మ‌నించ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.