Live Updates: 22వ రౌండ్లో బిజెపి 1,130 ఓట్లు ఆధిక్యం సాధించారు.
హుజురాబాద్, బద్వేలు ఓట్ల లెక్కింపు ప్రారంభం
Huzurabad:
Huzurabad: ఉప ఎన్నిక ఫలితాలు | ||||
Party | టిఆర్ఎస్ | బిజెపి | కాంగ్రెస్ | Round |
VOTES | 82348 | 106780 | 2767 | 22 |
Badvel:
Badvel: ఉప ఎన్నిక ఫలితాలు | |||
Party |
వైఎస్సార్సీపీ |
బిజెపి |
కాంగ్రెస్ |
VOTES | 112072 | 21661 | 6217 |
Huzurabad
- హుజూరా బాద్ ఉప ఎన్నికకౌంటింగ్ ముగిసింది.
- ఈ ఉప ఎన్నికలో భాజాపా అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించారు.
భాజాపా అభ్యర్థి ఈటెల రాజేందర్ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. 22వ రౌండ్లో 1,130 ఓట్లు ఆధిక్యం సాధించారు. మొత్తం బిజెపికి 1,06,780 ఓట్లు రాగా, తెరాసాకు 82,348 ఓట్లు పోలయ్యాయి. దీంతో బిజెపికి 23,865 ఓట్ల ఆధిక్యం లభించింది.
హుజూరా బాద్ ఉప ఎన్నికలో ఓటమిపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్పందించారు.
తెరాసాకు ఓటేసినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 20 సంవత్సరాలుగా తెరాస ఎన్నో ఆటుపోట్లు చవిచూసిందని, ఒక్క ఓటమికే కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు.`భవిష్యత్ పోరాటానికి కార్యకర్తలు సన్నద్ధమవ్వాలని అన్నారు.
Huzurabad
- 21వ రౌండ్లో బిజెపి 1720 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
బిజెపికి 5,151, తెరాసాకు 3,431 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ ముగిసేసరికి బిజెపి 22,735 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
Huzurabad
- హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటెల విజయం
ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై ఈటెల రాజేందర్ గెలుపొందారు. లెక్కించాల్సిన ఓట్లు 18,827 ఉన్నాయి. లెక్కించాల్సిన ఓట్ల కన్నా మెజారిటీ ఎక్కువగా ఉన్నందున ఈటల విజయం సాధించినట్లు చెబుతున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Huzurabad
- 20వ రౌండ్ బిజెపి అభ్యర్థి ఈటెల ఆధిక్యం
- లెక్కించాల్సిన ఓట్లు 18,827 ఉన్నాయి.
Huzurabad
- 19 వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బిజెపి ఆధిక్యం పెరుగుతుంది. ఈరౌండ్ లో ఈటల 19,541 అధిక్యంలో ఉన్నారు. ఇంకా మూడు రౌండ్ల కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది.
Huzurabad
- ఈరౌండ్‌లో భాజపా ఆధిక్యంలో ఉంది.
- 18వ రౌండ్ ముగిసే సరికి బిజెపి అభ్యర్థి 16,494 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నక ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇంకా 4 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది.
Huzurabad
- 17వ రౌండ్లో ఈటల హవా..
- ఈరౌండ్‌లో భాజపా 5,610 తెరాస 4,187 ఓట్లు వచ్చాయి.
Huzurabad
16వ రౌండ్లో ఈటలదే ఆధిక్యం.
ఈరౌండ్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 5,686 ఓట్లు ఆధిక్యం సాధించారు.
రౌండ్ పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 13,255 ఓట్లు ఆధిక్యం తో కొనసాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు సంబారాలు చేసుకుంటున్నారు.
- Huzurabad
- బండి సంజయ్‌కి అమిత్‌షా ఫోన్.. ఎన్నికల ఫలితంపై అభినందనలు
- హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో రాష్ట్రపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉప ఎన్నక ఫలితాలపై అభినందనలు తెలియజేశారు. ఇక, బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేయటం వలనే హుజురాబాద్‌లో బీజేపీ గెలుస్తోందని అమిత్ షాకు వివరించారు బండి సంజయ్.
- Huzurabad
- 15వ రౌండ్లో ఈటలదే ఆధిక్యం..
హుజూరాబాద్ ఓట్ల లెక్కింపులో 15వ రౌండ్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కొనసాగుతోంది. తన సమీప ప్రత్యర్ధి టిఆర్ ఎస్ అభ్యర్థి గెల్లుపై రాజేందర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
15వ రౌండ్ ముగిసే సరికి 11,583 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Huzurabad
- 14వ రౌండ్లో ఈటల 1,046 ఓట్లు ఆధిక్యం
14 వ రౌండ్ పూర్తయ్యేసరికి భాజపా 9,434 ఓట్లు ఆధిక్యం తో ముందుకు సాగుతున్నారు.
Huzurabad
భాజపా 4,836 తెరాస 2,971 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ 1,865 ఓట్లు ఆధిక్యం
13 వ రౌండ్ పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 8,388 ఓట్ల ఆధిక్యం సాధించారు.
Huzurabad
- 12 వ రౌండ్ పూర్తయ్యింది.
12 వ రౌండ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం. 11 వ రౌండ్లో తెరాస ఆధిక్యంలో ఉండగా..
మళ్లీ ఈ రౌండ్లో భాజపా 1,217 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. ఈ రౌండ్లో భాజపా 4,849, తెరాస 3,632 ఓట్లు వచ్చాయి.
Huzurabad
- 11వ రౌండ్లో టిఆర్ ఎస్ ఆధిక్యం
ఈ రౌండ్లో భాజపా 3,941, తెరాస 4,308 ఓట్లు వచ్చాయి.
బిజెపి అభ్యర్థి ఈ రౌండ్లో వెనుకబడ్డారు.
Huzurabad
- 10వ రౌండ్లో ఈటల ఆధిక్యం
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు కు 5,264 ఓట్ల ఆధిక్యం.
Huzurabad
- 9వ రౌండ్లో ఈటల 1835 ఓట్ల ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 9 వ రౌండ్లోనూ ఆధిక్యం సాధించారు.
ఈ రౌండ్లో ఈటల 1835 ఓట్ల ఆధిక్యం సాధించి
మొత్తంగా.. 5,105 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Huzurabad
- హుజూరాబాద్: 8వ రౌండ్లో టిఆర్ ఎస్‌కు స్వల్ప ఆధిక్యం.
హుజూరాబాద్ ఉప ఎన్నక ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. 8వ రౌండ్ పూర్తయ్యే సరికి టిఆర్ ఎస్‌కు స్వల్ప ఆధిక్యంలోకి వచ్చింది. మొదటి నుంచి ఏడో రౌండ్ వరకు ఆధిక్యాన్ని ప్రదర్శించిన బిజెపి అభ్యర్థి ఈటల ఈ రౌండ్లో వెనుకబడ్డారు.
ఎమిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటలకు 3,270 ఓట్ల ఆధిక్యం.
8వ రౌండ్లో బిజెపికి 4,086, టిఆర్ ఎస్‌కు 4,248, కాంగ్రెస్ 89 ఓట్లు వచ్చాయి.
8 రౌండ్లు ముగిసేసరికి బిజెపికి 35,107, టిఆర్ ఎస్‌కు 31,837 ఓట్లు, కాంగ్రెస్‌కు 992 ఓట్లు వచ్చాయి.
Huzurabad
- ఏడో రౌండ్లో ఈటలకు తగ్గిన ఆధిక్యం
హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు లో ఏడో రౌండ్ పూర్తయింది.
ఇప్పటి దాకా పెరుగుతు వచ్చిప ఆధక్యం ఈ రౌండ్లో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం తగ్గింది.
ఆయనకు కేవలం 252 ఓట్లు ఆధిక్యం మాత్రమే వచ్చింది.
ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటలకు 3,432ఓట్ల ఆధిక్యం.
7వ రౌండ్లో భాజపా 4,044, తెరాస 3,792 ఓట్లు వచ్చాయి.
రౌండ్ల తర్వాత భాజపాకు 31,021, తెరాసకు 27,589, కాంగ్రెస్‌కు 1,086 ఓట్లు వచ్చాయి.
Huzurabad
- ఆరో రౌండ్లోనూ ఈటలదే ఆధిక్యం
వీణవంక మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆరో రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యం సాధించారు. ఆరు రౌండ్ల తర్వాత బీజేపీ 3,186 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
ఈటల జోరు..
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు కు 3,186 ఓట్ల ఆధిక్యం.
హోరాహోరీగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో వరుసగా ఆరు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించారు. రౌండ్ రౌండ్‌కు కమలం పార్టీ ఆధిక్యం పెరుగుతోంది.
ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల 3,186 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
6వ రౌండ్లో బీజేపీ 4,656, తెరాస 3,639, కాంగ్రెస్ 180 ఓట్లు వచ్చాయి.
6వ రౌండ్లో ఈటల 1,017 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఆరు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 26,983, తెరాసకు 23,797 ఓట్లు నమోదయ్యాయి. కాంగ్రెస్‌కు 992 ఓట్లు వచ్చాయి
Huzurabad
- ఈటల హవా..
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ హవా కొనసాగిస్తున్నారు. వెలువడిన ఐదు రౌండ్ల ఫలితాలలోనూ ఈటల ఆధిక్యాన్ని ప్రదర్శించారు.
ఐదు రౌండ్లు ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఐదో రౌండ్లో బీజేపీ 4,358.. టీఆర్ఎస్ 4,014.. కాంగ్రెస్ 132 ఓట్లు సాధించాయి.
మొత్తంగా ఐదు రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ 22,327.. టీఆర్ఎస్ 20,158.. కాంగ్రెస్ 680 ఓట్లు సాధించాయి.
Badvel
- 12వ రౌండ్లోనూ ‘ఫ్యాన్’ హవా
12వ రౌండ్లో 483 ఓట్ల ఆధిక్యం సాధించిన వైఎస్సార్సీపీ.
మొత్తంగా 90,211 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపును సొంతం చేసుకుంది.
అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్సీపీ 1,11,849 ఓట్లు, బీజేపీ 21,638 ఓట్లు, కాంగ్రెస్ 6,223 ఓట్లు సాధించాయి.
Huzurabad
- హుజురాబాద్ లో 5వ రౌండ్ పూర్తి
- కొనసాగుతున్న బిజెపి ఆధిక్యం
- ఈటల రాజేందర్ 2,169 ఆధిక్యం లోఉన్నారు.
Badvel
- బద్వేలులో 10వ రౌండ్ పూర్తయ్యేసరికి వైకాపా అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
- దాసరి సుధ 85,505 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు
Huzurabad
- 4వ రౌండ్లో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం
- 4వ రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ 1,825 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
Badvel
- బద్వేలులో 8వ రౌండ్ పూర్తి
- 8వ రౌండ్ ముగిసేసరికి వైకాపా 68,492 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
Badvel
- బద్వేలులో 7వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది.
- వైకాపా 17,026, భజాపా 1,985, కాంగ్రెస్ 841
Badvel
- ఐదో రౌండ్ ముగిసేసరికి దాసరి సుధ ముందంజలో ఉన్నారు.
Huzurabad
- మూడో రౌండ్ లో ఈటలదే జోరు
- మూడో రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ 911 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
Huzurabad
- రెండో రౌండ్లోనూ ఈటల రాజేందర్‌కు ఆధిక్యం
భజాపా అభ్యర్థి ఈటల రాజేందర్ రెండో రౌండ్లో 358 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.
Huzurabad
- తొలి రౌండ్లో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో తొలి రౌండ్లో బిజెపికి 166 ఓట్ల ఆధిక్యం
బిజెపి 4610, టిఆర్ఎస్ 4444, కాంగ్రెస్ 114 ఓట్లు సాధించాయి.
Huzurabad:
- పోస్టల్ బ్యాలెట్లో టిఆర్ఎస్ ఆధిక్యం
టిఆర్ఎస్కు పోస్టల్ బ్యాలెట్లో 503, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32, చెల్లనవి 14గా ఉన్నాయి.
Huzurabad:
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
Huzurabad:
- హుజూరాబాద్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
హుజూరాబాద్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 8 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ 8.30 వరకూ కొనసాగనుంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి.
అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడనున్నాయి.