నిర్మల్‌లో ప్రైవేటు బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..

నిర్మల్ (CLiC2NEWS): జిల్లాలోని కొండాపూర్ బైపాస్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున కొండాపూర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నిర్మల్ ఏరియా ఆసుపత్రికి పంపించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.