AP: గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం లీగల్ అడ్వైజర్ గా న్యాయవాది టి వి గోవిందరావు..

మండపేట (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఏపీ సర్కిల్ లీగల్ అడ్వైజర్ గా హైకోర్టు న్యాయవాది టివి గోవిందరావును నియమించారు. ఈ మేరకు ఆలిండియా గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ మహాదేవయ్య ఆదేశాలు జారీ చేశారు. గోవిందరావు గత 18 సంవత్సరాలుగా న్యాయవాది వృత్తిలో ఉన్నారు. 1964 మార్చి 20న పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి గ్రామంలో జన్మించారు. ఎలిమెంటరీ ప్రాథమికోన్నత పాఠశాల విద్యను పెరవలి, ఈతకోత, కాకరపర్రు పాఠశాలల్లో అభ్యసించారు. ఇంటర్మీడియట్ విద్యను తణుకులో అభ్యసించారు. అనంతరం పెనుగొండ కళాశాలలో బీఎస్సీ చదివారు. ఎం ఎ ఎల్ ఎల్ బి చేశారు. ఆంధ్రజ్యోతి, ఉదయం, వార్త, ఆంధ్రప్రభ దినపత్రికలకు జర్నలిస్టుగా పని చేశారు. నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు సంస్థలకు న్యాయవాదిగా పని చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆహార సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఉన్న భారత ప్రభుత్వ ప్రమాణాల సంస్ధ ( బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ) కు తెలంగాణ ప్రాంతానికి లీగల్ ప్రాసిక్యూటర్ గా పని చేస్తున్నారు. ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్వైజర్ అసోసియేషన్ కు లీగల్ అడ్వైజర్ గాను వైఎస్సార్సీపీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గానికి లీగల్ సెల్ కన్వీనర్ గాను పని చేస్తున్నారు. సెంట్రల్ కంజ్యూమర్స్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ కు లీగల్ అడ్వైజర్ గా పని చేస్తున్నారు. గోవిందరావు నియామకం పట్ల ఏపీ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదులు వి సాయికుమార్, టి కిరణ్, ఇండియన్ ఫార్మాష్యూటికల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ టీవీ నారాయణ, లేనోరా డెంటల్ కాలేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగార్జునరెడ్డి, ప్రొఫెసర్ జి శ్రీరామ చంద్రమూర్తులు ఆయనను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.