AP: టూవీలర్స్పైకి దూసుకెళ్లిన కారు.

తిరుపతి (CliC2NEWS) : తిరుపతిలో కొత్త కారు బీభత్సం సృష్టించింది. తిరుపతిలోని లీలామహల్ సెంటర్లో శుక్రవారం ఓ కారు పార్క్ చేసి ఉన్న టూవీలర్స్పైకి దూసుకెళ్లింది. పండగ సందర్భంగా కొత్త కారు తీసుకొని ఇంటికి వెళ్తుండగా టైరు పేలి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దిరికి గాయాలయ్యాయి. పార్కింగ్ చేసి ఉన్న8 వాహనాలు ధ్వంసమయ్యాయి.