నేటి నుండి ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం ప్రారంభం

హైదరాబాద్ (CLiC2NEWS): ఎన్టీఆర్ స్టేడియంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు (శుక్రవారం)నుండి కోటి దీపోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుందది. భక్తి టివి ఆధ్వర్యంలో నవంబరు 12వ తీదీ నుండి 22వ తేదీ వరకు 11 రోజుల పాటు దీపోత్సవ వేడుకులు జరగనున్నవి. ఈ కార్యక్రమం ప్రతి రోజూ 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ప్రవేశం ఉచితం. డబుల్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని అనుమతిస్తారు. భక్తులు వ్యాక్సినేషన్ సర్టిపఫికెట్ లేదా కొవిడ్ నిగెటివ్ రిపోర్ట్ తప్పసరిగా తీసుకువెళ్లాలి. దేవతామూర్తులు, దీపారాధన నిమిత్తం వత్తులు, నూనె, ప్రమిదలు వంటి పూజాద్రవ్యాలన్నింటిని ఉచితంగా అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.
తిరుమల, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, శ్రీకాళహస్తి, వేములవాడ, యాదాద్రి, కాణిపాకం, అన్నవరం, సింహాచలం, ద్వారక తిరుమల, ఒంటిమిట్ట తదితర ఉత్సవ మూర్తుల కల్యాణోత్సవాలు జరుగుతాయి. పదకొండు రోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో భాగంగా స్వర్ణలింగోద్భవం, మహానీరాజనం, సప్తహారతులు, సాంస్కృతిక కదంబాలు వంటి ఎన్నో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి.