వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ధ‌ర్నా

కామారెడ్డిః వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శుక్ర‌వారం కాంగ్రెస్ నాయ‌కులు ధర్నా నిర్వహించారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “తెలంగాణ . ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రపతికి పంపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు తీవ్రనష్టం. బడా కంపనీలతో ప్రధాని మోడీ కుమ్మ‌క్క‌య్యారు.  గత కాంగ్రెస్ పార్టీ హయాంలో లో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు వాటి నిలువలపై పరిమితులు విధించేది. పద్దతి ప్రకారం ఫలానా సరుకు ఫలానా క్వింటాళ్లు లేదా టన్నులు మాత్రమే నిల్వచేసుకోవాలి. అంతకుమించి నిలువ చేసుకోకూడదు అని ఇప్పుడు బిజెపి నరేంద్ర మోడి అటువంటి పరిమితులు పూర్తిగా ఎత్తేశారు. ఇది ఎంతో మంచి చట్టంఅని, రైతుకే మాయమాటలు చెపుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ప్రకారం సప్లై చైన్ లో రైతులనుంచి రీటైలర్ వరకూ ఎవరు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. నిత్యవసర సరుకుల ధరలు రెట్టింపు అయినపుడు, కూరగాయల ధరలు 100% పెరిగినపుడు మాత్రమే ప్రభుత్వం నిల్వల మీద అప్పుడు ఆంక్షలు విధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీరు ఎలా ఉంది అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటాం అని బాహాటంగా చెప్పేస్తోంది. ఈ బిల్లు వలన 86% చిన్న సన్నకారు రైతులున్న దేశంలో రైతులు తమ పొలంలో పండిన వాటిని సొంతంగా స్టోర్ చేసుకోలేరు. ఎందుకంటే రైతులకు రిలీయన్స్ ఫ్రెష్ లు, హెరిటేజ్ ఫ్రెష్ లు, వాళ్లకు ఉన్నటు ఎసి గోడౌన్లు రైతులకు లేవు. కాబట్టి ఎలాగైనా దళారీలకో, కంపెనీలకో ఉత్పత్తి అయిన పంట పాడు అవకుండా తొందరగా అమ్మేస్తారు. ఇక్కడ లాభం పొందేది దళారీలు, కార్పొరేట్ కంపెనీలు మాత్రమే. ఎప్పటిలానే రైతు మోసపోతాడు. ఎక్కడో ఉన్న గుజరాత్, బాంబే, ఢిల్లీ కంపెనీలు ఆంధ్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కొనుగోలు చేయడానికి వీలులేదు కాబట్టి ఆ బడా కంపెనీలకోసం రైతులకు మేలు చేస్తున్నట్టు ఇంకో సవరణ చేసింది బీజేపీ ప్రభుత్వం అదే రెండో చట్టం.. రైతులు భారతదేశంలో ఎక్కడైనా సరే తమ పంట ఉత్పత్తులు అమ్ముకునే చట్టం ఇది. ఒక చిన్న, సన్నకారు రైతు నిజంగా తన పంటను వేరే రాష్ట్రానికి వెళ్లి అమ్ముకుంటాడా? పక్క జిల్లాలోని మార్కెట్ యార్డులోనే అమ్ముకోవడానికి ట్రాక్టర్లు, లారీలకు కిరాయిలు ఇచ్చుకోలేక నలిగిపోతున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక సరైన ధర లేక కొన్నిసార్లు అక్కడే పడేసి వస్తున్నాడు. ఒకవేళ దూరప్రాంతలకు పంటను తీసుకెళ్ళితే ఏ విధముగా రైతులకు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వస్తుందో గ్యారంటీ ఇవ్వగలరా?. కనీస మద్దతు ధరల జాబితాలో ఉన్న పంటలు కొన్ని ప్రభుత్వం కొనకపోతే దళారులే వారికి ఇష్టం వచ్చిన ధర రైతులకు ఇచ్చి కొంటున్నారు. కాబట్టి ఇది రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి చేసిన చట్టం కాదు. మధ్య దళారీలు, కార్పొరేట్ కంపెనీలు దేశంలో & ప్రపంచంలో ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ అమ్ముకోవడానికి ఈ చట్టం ఇది. రైతుకు లాభాలు రాకపోతే కార్పొరేట్స్ కి తన పంటను ఎలా అమ్ముతాడు అనే డౌట్ వస్తోంది కదా… దానికి కూడా మన నాయకులు చట్టం ద్వారా బడాబాబుల ఒక వెసులుబాటు ఇచ్చారు. అదే మూడో చట్టం… కాంట్రాక్ట్ ఫార్మింగ్… రైతులతో కంపెనీలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయడానికి అనుమతులు. రైతు ముందుగానే ఏ పంట వేయాలో, ఏ ఎరువును వాడాలో అని నిర్దేశించి ఈ కార్పొరేట్ కంపెనీలు రైతులతో 5 సంవత్సరాల వరకూ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఈ అగ్రిమెంట్ లో ఎంత ధర ఉంటే అంతే రైతు తీసుకోవాలి.
రాబోయే 5 ఏళ్ల కాలంలో ధరలు పెరిగినా రైతు మాత్రం అగ్రిమెంట్ ప్రకారమే డబ్బు పొందుతాడు కానీ మార్కెట్ రేటు ప్రకారం కాదు. నిండిపోయి సారం కోల్పోతుంది. గ్రౌండ్ వాటర్ మొత్తం అయి చిన్న సన్నకారు రైతులు అంత తమ భూములను కంపెనీలకు ఇచ్చి తిరిగి రైతులంతా అందులో కూలీలుగా మారతారు అని అలాంటి భూమి ని ఏమీ చేసుకోలేక చివరకు ఆ దళారీలకో, కంపెనీలకో భూముల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని తెలిపారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి ఎడ్ల రాజిరెడ్డి పండ్లరాజు గడుగుశ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.