ఆటలతో తెలివితేటలు..

నవభారత లైయన్స క్లబ్ పేదల సంక్షేమ శాఖ అధిపతి లైన్ డి.కోటేశ్వరరావు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఆటల వల్ల పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయని నవభారత లైయన్స క్లబ్ పేదల సంక్షేమ శాఖ అధిపతి లైన్ డి.కోటేశ్వరరావు అన్నారు. 14న పిల్లల దినోత్సవం సందర్భంగా నవభారత్ లైయన్స క్లబ్ ఆధ్వర్యంలో సిటి మోడల్ ప్రైమరీ స్కూల్ లో విద్యార్థులకు మెమొరి, ఆటలు & పాటల పోటీలలో గెలుపొందిన మొదటి,రెండవ స్థానంలో వచ్చిన “32” మంది పిల్లల కు, సర్టిఫికెట్, బహుమతులను డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ హాల్లో అందజేశారు.

పిల్లలు, మొక్కలు సున్నితమైన వని అందుకే ముందుగా మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నవభారత లైయన్స క్లబ్ పేదల సంక్షేమ శాఖ అధిపతి లైన్ డి.కోటేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలకు చదువు చెప్పడం మాత్రమే కాదు… ఆటలు పాటలు కూడా నేర్పించాలన్నారు. ఆటలు వల్ల చిన్నారుల్లో ఆత్మ విశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మక శక్తి పెరుగుతుందని తెలిపారు.

రిజనల్ చైర్ పర్సన్ లైన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆటలతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా, దృఢంగా తయారవుతారన్నారు.

అధ్యక్షుడు లైన్ జె.టి.విద్యా సాగర్ మాట్లాడుతూఆటలాడిద్దాం …ఎదగనిద్ధామన్నారు.పిల్లలు సున్నితత్వానికి ప్రతిరూపాలని అడుగులు తడబడనీయక… తప్పులు సరిదిద్దుతూ చక్కని వ్యక్తిత్వాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.! క్రమశిక్షణతో… వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలన్నారు.

కన్వీనర్ లైన్ డా.హిప్నో పద్మా కమలాకర్ అతిథులకు స్వాగతం పలుకగా, స్కూల్ హెచ్ మ్ ఆఫ్సానా వందన సమర్పణ చేశారు.
మోటివేషన్ ట్రైనర్స్ హెచ్ జిలే మ్యాజిక్ ద్వారా ఒత్తిడిని లేకుండా ఎలా చదవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో లైన్ హర్ష, ప్రోగ్రాం హెచ్ ఓడి మౌనిక, క్లబ్ జిల్లా చైర్మన్ లైన్ ఎన్.రామ్ ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి లైన్ వి.జె.క్యార్లిన్, మొదట, ఉపాధ్యక్షులు లైన్ గోపాల్ కృష్ణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ అన్నం నితేష్ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.