AP: మూడు రాజధానుల బిల్లును ఉప‌సంహ‌రించుకుంటున్నాం

 

అమరావతి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క‌ నిర్ణ‌యం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉప‌సంహ‌రించుకుంది. వికేంద్రీక‌ర‌ణ బిల్లు, సిఆర్గిఎ ర‌ద్దు బిల్లుల‌ను కేబినెట్ ర‌ద్దు చేసిన‌ట్లు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ శ్రీ‌రాం హైకోర్టుకు తెలిపారు. ఎపి సిఎం జ‌గ‌న్ అసెంబ్లీలో దీనిపై ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎపిలో మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ సుమారు రెండేళ్లుగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న విషయం తెలిసిన‌దే. రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాల్‌చేస్తూ అమ‌రావ‌తి రైతుల‌తో స‌హా ప‌లువురు న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించారు. దీనిపై ఎపి హ‌కోర్టు, సుప్రీంకోర్టులోనూ కేసులు న‌డుస్తున్నాయి. తాజ‌గా హైకోర్టు రాజ‌ధాని కేసులపై విచార‌ణ చేప‌ట్టిన‌ది.

Leave A Reply

Your email address will not be published.