ఏపీలో కొత్తగా 7,293 కరోనా కేసులు
తాజాగా 57 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 7,293 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరో 57 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,68,751కు చేరింది. శనివారం వరకు 5,97,294 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి 5,663 మంది మరణించారు. 24 గంటల్లో 9,125 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 55,23,786 శాంపిల్స్ పరీక్షించారు. ఉభయ గోదారి జిల్లాల్లో 1011 కేసులు నమోదు కాగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 922 పాజిటివ్ కేసులు వచ్చాయి. అలాగే చిత్తూరులో 975, ప్రకాశం 620, కడప 537, అనంతపురం 513 చొప్పున అధికేసులు నమోదయ్యాయి.
ప్రకాశం 10, చిత్తూరు, కడప జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. కృష్ణా 6, విశాఖ 5, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. అనంతపురం 2, శ్రీకాకుళం 2, కర్నూలు, విజయనగరంలో ఒకరు చొప్పున మృతి చెందారు.