నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

నిజామాబాద్(CLiC2NEWS): నిజామాబాద్ స్థానిక సంస్థల టిఆర్ ఎస్ ఎమ్మెల్సి అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. టిఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్సి కవిత, స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేశారు. కోటగిరి శ్రీనివాస్ పై ఫోర్జరీ ఆరోపణలు రావడంతో శ్రీనివాస్ నామినేషన్ తిరస్కరించడం జరిగింది. దీంతో కవిత ఎమ్మెల్సీగా ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక ప్రధాన ప్రతి పక్షాలైన బిజెపి, కాంగ్రెస్ ఎమ్మెల్సి పోటీకి దూరంగా ఉన్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ ఆర్బన్ ఎమ్మెల్యేలు, మంత్రులు సంబరాలు జరుపుకుంటున్నారు