జలమండలిలో సంవిధాన్ దివస్ వేడుకలు

హైదరాబాద్(CLiC2NEWS): ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సంవిధాన్ దివస్(రాజ్యాంగ దినోత్సవ) వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణకు, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని జలమండలి ఉద్యోగుల చేత ఎండీ దానకిశోర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భిన్నత్వంలో ఏకత్వానికి మన దేశం ప్రతీకగా నిలుస్తుందని, దేశంలో భిన్న భాషలు, సంస్కృతులు, కులాలు, మతాలు, ప్రాంతాల వారు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారంటే అది మన రాజ్యాంగం గొప్పదనమని కొనియాడారు. భారతదేశానికి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.సత్యనారాయణ, పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, సీజీఎంలు, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
—