TS: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసుపత్రి నుండి డిశ్ఛార్జ్

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రినుండి డిశ్ఛార్జ్ అయ్యారు. ఆయన ఈనెల 24వ తేదీన కరోనాతో గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసినదే. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో వైద్యులు ఆయనను డిశ్ఛార్జ్ చేశారు. ఆయన మరికొన్ని రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు.