కామారెడ్డి జిల్లాలో గుండెపోటుతో రోగి, వైద్యుడు మృతి

కామారెడ్డి (CLiC2NEWS): గుండె నొప్పితో వచ్చిన వ్యక్తికి వైద్యం చేస్తుండగా డాక్టర్‌కు కూడా గుండెపోటు రావటంతో ఇద్దరూ మృతి చెందారు. ఈ హృదయ విదారకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన వ్యక్తికి ఉదయం గుండెపోటు రావడంతో గాంధారి మండలంలోని ఆసుపత్రికి తీసుకువచ్చారు. పేషెంట్‌కు ట్రీట్మెంట్ చేస్తుండగా డాక్టర్ లక్ష్మణ్‌కు కూడా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పేషెంట్‌కి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమద్యంలో రోగి కూడా మృతి చెందారు. దీంతో ఇరువురి కుటుంబాలలో విషాద చాయలు అలుముకున్నాయి.