తాడేపల్లిలోని గోశాలను సందర్శించిన సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను సోమవారం సందర్శించారు. ఈ గోశాలలో ఆరు రకాల దేశీ ఆవులు.. కపిల, గిర్, పుంగనూరు, కాంక్రిజ్, తార్ పార్కర్, సాయివాలా జాతితో పాటు అరుదైన ఆవులు ఇక్కడ ఉన్నాయి. పూర్తిగా సాంప్రదాయం ఉట్టిపడేలా గోశాలను వెదురు, తడికెలు, రాయి మాత్రమే వాడి పర్యావరణహితంగా అద్భుతంగా నిర్మించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పలు గోవులను ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ సదర్శనలో ముఖ్యమంత్రి గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.