కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
ఢిల్లీ : న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ (82) ఈరోజు ఆదివారం ఉదయం కన్నుమూశారు. దివంగత ప్రధాని వాజ్‌పేయి హయాంలో జశ్వంత్ సింగ్ రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ (82) కన్నుమూశారు. ఆదివారం ఉదయం ఆయన మృతి చెందారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి ఆయన అమోఘమైన సేవలు అందించారని కొనియాడారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా జశ్వంత్ మృతికి సంతాపం తెలిపారు. పలువురు బీజేపీ నేతలు జశ్వంత్ సింగ్ మృతిపట్ల సంతాపం తెలిపారు. కాగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో జశ్వంత్ సింగ్ ఒకరు. పార్లమెంటు సభ్యుడిగా అత్యధిక కాలం పనిచేసిన నేతగా ఆయనకు పేరుంది. ఇక వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో జశ్వంత్ సింగ్ కీలక శాఖలు చేపట్టారు. ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల్లాంటి కీలక శాఖలన్నింటినీ నిర్వహించిన అతి కొద్దిమందిలో ఆయన ఒకరు. ఇక 1999 డిసెంబరులో భారతీయ విమానం హైజాక్‌కు గురైనప్పుడు హైజాకర్లతో పాటు జశ్వంత్ కూడా కాందహార్ వెళ్లారు.