సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలు

తూర్పు గోదావరి (CLiC2NEWS) : రాబోయే సీతారాముల వారి కళ్యాణానికి ప్రతి ఏడాది మాదిరిగా కోటి తలంబ్రాలు కోసం ధాన్యం సిద్ధం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం అచ్యుతాపుంలోని కళ్యాణం అప్పారవు పొలంలో స్వామివారి తలంబ్రాల కోసం పండించిన పంటనుండి ధాన్యం సేకరిస్తున్నారు. శ్రీరాముడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు వేషధారణలో భక్తులు రామనామం జపిస్తూ పంట కోతల్లో పాల్గొన్నారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని తెలుగు రాష్ట్రాలోని దాదాపు 3వేల మంది భక్తులతో ఒడ్లు ఒలిపించి తలంబ్రాలను సిద్ధం చేస్తారని కళ్యాణం అప్పారావు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుందని తెలియజేశారు.