నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి

నిజామాబాద్(CLiC2NEWS): జిల్లాలోని వేల్పూర్‌లొ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ నిష్పక్షపాతంగా ఇండ్లను కేటాయించామని అన్నారు. సిఎం కెసిఆర్ అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వేల్పూర్‌లో 112 ఇండ్ల నిర్మాణం కోసం రూ.7 కోట్లు మంజూరు చేసిన సిఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో స్థలం ఉన్నవారందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని స్పష్టంచేశారు.