38వ రోజు అమరావతి రైతుల పాదయాత్ర

అమరావతి(CLiC2NEWS): అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. 38వ రోజు చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం చింతలపాలెం నుండి ప్రారంభమయింది. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి ఉండాలని ‘ న్యాయంస్థానం నుండి దేవస్థానం’ పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు చిత్తూరు జిల్లా చింతలపాలెం నుండి శ్రీకాళహస్తి పట్టణం వరకు కొనసాగుతుంది. ఈ పాదయాత్రకు స్థానికులు నీరాజనాలు పడుతున్నారు. ఈ పాదయాత్రకు మద్దతుగా సిపిఐ జాతీయ నేత నారాయణ సంఘీభావం తెలియజేశారు. రైతులందరూ ఇవాళ రాత్రికి శ్రీకాళహస్తిలో బస చేయనున్నారు.