తెలంగాణలో 205 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదు. కరోనా కేసులు తగ్గుతున్నాయనుకుంటే తజాగా స్వల్పంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో 38,085 నమూనాలు పరీక్షించగా.. తాజాగా 205 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణయ్యింది. కొవిడ్ వలన నిన్న ఒకరు మృతి చెందారు. కాగా కరోనా మహమ్మారి బారినుండి నిన్న 185 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,871 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
దేశంలో కొత్తగా 8439 కేసులు