గాంధీలో సిటీ స్కాన్ సేవలు ప్రారంభం..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని గాంధీ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ శనివారం ప్రారంబించారు, అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆసుపత్రిలలో 21 సిటీ స్కాన్ కేంద్రాలను మంజూరు చేశామని తెలిపారు. మొదటి సిటీ స్కాన్ కేం్రదాని్న గాంధీ లో ఇవాళ ప్రారంభించామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సిటీ స్కాన్ అవసరం ఎంతో ఉంటుందని ఆయన తెలిపారు. గాంధీ లో గత రెండేళల్లుగా క్యాథ్ ల్యాబ్ పనిచేయకపోవడంతపై అధికారులతో చర్చించాని తర్వలోనే క్యాథ్ లాబ్‌ని తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపడుతామని తెలిపారు. గాంధీలో ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయని వైద్యులు తెలిపారని.. త్వరలో మరో 200 పడకలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త కరోనా వేరియంట్ `ఒమిక్రాన్‌పై ఆందోళన అవసరం లేదని తెలిపారు. కొవిడ్ సమయంలో దాదపు 84 వేల మందికి వైద్య సేవలు అందించిన ఘనత గాంధీ ఆసుపత్రిదని మంత్రి పేర్కొన్నారు. బతకడం కష్టం అనే స్థితిలో ఉన్నవారికి సైతం గాంధీలో చికిత్సఅందించి ప్రాణాలు పోశారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.