విజయవాడ అట్టిక గోల్డ్ షాప్‌లో భారీ చోరీ..

విజయవాడ(CLiC2NEWS): బందరు రోడ్డులో ఉన్న అట్టిక గోల్డ్ షాప్‌లో చోరీ జరిగింది. పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే రెండు గంటల్లో నిందితుడిని అరెస్టు చేశారు. షాప్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న శిరికొండ జయచంద్రశేఖర్ చోరీకి పాల్పడినట్టు నగర పోలీస్ కమిషనర్ తెలియజేశారు. అట్టిక గోల్డ్ షాప్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ నగదు ఎక్కువగా ఉన్న సమయంలో చోరీకి ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలిసింది. ముందస్తు పథకం ప్రకారం ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా రూ. 60లక్షల నగదు, 47 గ్రాముల బంగారం , కిలోన్నర వెండి ఆభరణాలను అపహరించాడు. షాప్ యాజమాన్యం అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ర్యాప్తు చేసి 2 గంటల వ్యవధిలో నిందుతుడిని ,నగదు, ఆభరణాలతో సహా పట్టుకున్నారు.