రైతుల పాద‌యాత్ర ముగింపు స‌భ‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఆహ్వానం

అమ‌రావ‌తి(CLiC2NEWS) :  రైతుల పాద‌యాత్ర ముగింపు స‌భ‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హాజ‌ర‌వుతార‌ని మ‌హిళా రైతులు తెలిపారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఉన్నార‌ని అమ‌రావ‌తి రైతులు అన్నారు. ఈ సంద‌ర్భంగా రైతులు మంగ‌ళ‌గిరిలో ఆయ‌న‌ను క‌లిసి కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. పాద‌యాత్ర ముగింపు స‌భ‌కు ప‌వ‌న్‌ను ఆహ్వానించామ‌ని, అయ‌న వ‌స్తానన్నార‌ని మ‌హిళా రైతులు చెప్పారు. తిరుప‌తిలో నిర్వ‌హించ‌నున్న పాద‌యాత్ర ముగింపు స‌భ‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించిన విష‌యం తెలిసిన‌దే.

అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర 42వ రోజుకు చేరింది. ఈరోజు అంజిమేడు నుండి మొద‌లై 11 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర కొన‌సాగింది. కొంద‌రు మ‌హిళా రైతులు ఆనారోగ్యం సైతం లెక్క‌చేయ‌కుండా పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు అమ‌రావ‌తియే ఏకైక రాజ‌ధాని అని అమ‌రావ‌తి నుండి రాజ‌ధాని త‌ర‌లిపోకుండా కాపాడుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు మ‌హిళారైతులు.

Leave A Reply

Your email address will not be published.