వి ఎస్ యూనివర్సిటీ లో సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు

నెల్లూరు (CLiC2NEWS): విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని శ్రీపొట్టిశ్రీరాములు భవనంలో సావిత్రి భాయి పూలే దేశ తొలి మహిళా ఉపాధ్యాయులు, సంఘ సంస్కర్త జయంతి సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి యం సుందర వల్లి గారు, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి యం సుందర వల్లి గారు మాట్లాడతూ.. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాద్యాయురాలు, పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి సావిత్రి భాయిపూలే జన్మదినమైన జనవరి ౩న జాతీయ మహిళా టీచర్స్ దినోత్సవంగా జరుపుకుంటారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ కృష్ణ రెడ్డి, ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్ మరియు భోధనేతర సిబ్బంది విద్యార్ధిని, విద్యార్ధులు తదితరులు పాల్గొనారు.