ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాల‌ని బిజెపి నిర‌స‌న‌

నిర్మ‌ల్/నాగర్ కర్నూల్ః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచే జీవొ ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగ‌ళ‌వారం రాష్ట్రవ్యాప్తంగా బిజెపి శ్రేణులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేశారు. నిర్మల్ త‌హశీల్ దార్ కార్యాల‌యం ముందు పట్టణ బిజెపి అధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా బిజెపి కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ హాజరై ప్రసంగిస్తూ ప్ర‌భుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ జీవో వల్ల పేద మధ్యతరగతి ప్రజలు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని, దీనిని వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ జీవో మూలంగాపది వేల నుండి యాభై వేల రూపాయల వరకు పన్ను కడితే తనకు ఇళ్లు కట్టుకునే అవకాశం వస్తుంది. అదే విధంగా ముఖ్యంగా నిర్మల్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బంధువులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్మల్ జిల్లా కేంద్రంలో మరియు మండలాల కేంద్రాల్లో శిఖం భూములు, లావని పట్టా భూములు అసైన్ భూములు పట్టా సంపాదించుకోవడం కోసం ఎల్ఆర్ఎస్ జివోను తీసుకురావడం జరిగింద‌ని ఆరోపించారు. కోట్ల విలువ చేసే భూములను కబ్జాకు గురిచేస్తూ నిరుపేదలకు ఇళ్లు కట్టుకోవటానికి భూములు లేకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కృషి చేయడం జరుగుతుంద‌ని పేర్కొన్న‌రు. సిఎం కెసిఆర్ వెంటనే ఈ జీవోను రద్దు చేయకుంటే బిజెపి రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి గద్దె దింపే దాకా పోరాడుతామని బిజెపి హెచ్చరించారు. ఈ ధర్నాలో బిజెపి జిల్లా కార్యదర్శి శ్రీ గాదె విలాస్ నాయకులు సాదం అరవింద్ సత్యనారాయణ నారాయణగౌడ్ అనుముల శ్రావణ్ అల్లం భాస్కర్ కొండోజు శ్రావణ్ కోటగిరి గోపి సంతోష్ రాజ్ ఆకుల కార్తీక్ శివకుమార్ గిల్లి విజయ్ తదితరులు పాల్గొన్నారు

 

కల్వకుర్తిః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ ఆర్ ఎస్ పథకాన్ని రద్దు చేయాలని బిజెపి పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ పేర్కొన్నారు, మంగళవారం బిజెపి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆయన కల్వకుర్తి పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట కల్వకుర్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం తహసిల్దార్ రాంరెడ్డి కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణగౌడ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా ఓ పక్క ప్రజలకు ఉపాధి కరువై తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతుల పంటలు సరిగ్గా పండగ ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ సాగుతో ప్రజలపై భారం మోపి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు ఆయన అన్నారు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయకపోతే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు దుర్గ ప్రసాద్, కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు శేఖర్ రెడ్డి,నాయకులు బోడ నర్సింహ,రహమతుల్లా, వీరస్వామి,రవి గౌడ్,రాంరెడ్డి, నరేష్ గౌడ్,అంజన్ రెడ్డి, శ్రీపతి, శ్రీశైలం,బాబి,మధుసూదన్ రెడ్డి,నరసింహారెడ్డి,పవన్ కళ్యాణ్,భాస్కర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.