నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురుమృతి

కడెం (CLiC2NEWS): నిర్మల్ జిల్లాలో ఆటో ప్రమాదానికి గురై ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. నిర్మల్ జిల్లాలో కడెం ప్రాంతంలో ఆటో రోడ్డు ప్రక్కన ఉన్న పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.