సుందిళ్ల బ్యారెజ్ పనుల పరిశీలించిన మంత్రి..

జైపూర్ (CLiC2NEWS): చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటులో భాగంగా చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం షెట్ పల్లి పంప్ హౌస్ వద్ద సుందిళ్ల బ్యారేజ్ ను ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్ గారు, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ , మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్, జిల్లా కలెక్టర్, కాళేశ్వరం ENC వెంకటేశ్వర్లు, CE రమేష్, EE శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.