టివిజిః `గోదావ‌రి` రాజ‌కీయం

నిమ్మకాయల చిన్న రాజప్ప

తూర్పుగోదావ‌రి జిల్లాలో సామాన్య కార్య‌క‌ర్తగా మొద‌లు పెట్టిన‌ రాజ‌కీయ ప్ర‌స్థానం.. పార్టీ జిల్లా అధ్య‌క్షుడిగా.. శాస‌న స‌భ్యుడిగా, మంత్రిగా.. ఉప ముఖ్య‌మంత్రిగా ఎదిగిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా ఎంద‌రికో ఆర్శ‌నీయం.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. నీతి, నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌, విశ్వ‌స‌నీయ‌త‌కు పెట్టింది పేరు.. ఉభ‌య‌గోదావ‌రుల్లో ప‌రిచ‌యం అక్క‌ర్లే పేరు.. ఆయ‌నే నిమ్మకాయల చిన్న రాజప్ప….  ఈ రోజున‌ (అక్టోబ‌రు 1న) ఆయ‌న జ‌న్మ‌దినం..

చినరాజప్ప 1953, అక్టోబరు 1వ తేదీన వెంకట రంగయ్య, కొండమ్మ దంపతులకు జన్మించారు. రాజప్ప జన్మస్థలం పెదగాడవల్లి, ఉప్పలగుప్తం మండలం, తూర్పుగోదావరి జిల్లా. రాజప్పకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రాజప్ప తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ, ఎం.ఏ వరకూ చదివివారు. తరువాత 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలక సభ్యునిగా కొనసాగారు.

1986 లో తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1987 లో ఉప్పలగుప్తం మండలం ఎమ్.పి.పి.గా ఎన్నికై మండలాన్ని జిల్లాలోనే ఉత్తమ మండలంగా తీర్చి దిద్దిన ఘనత వహించారు. 1992లో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఎన్నికై 2014 వరకూ సుదీర్ఘ కాలం ఆ పదవిలో కొనసాగి తన సమర్థతను నిరూపించుకున్నారు. 1995లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ ఛైర్మన్ గా, 1998 లో సివిల్ సప్లైస్ ఛైర్మన్ గా, 2001లో కెనరా బ్యాంక్ డైరెక్టర్ గా వివిధ పదవులను అధిరోహించి ఆయా సంస్థలను సమర్థవంతంగా పాలించారు. 2007 నుండి 2013 వరకూ ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికలలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అదేశానుసారం మెట్ట ప్రాంతమైన పెద్దాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ ఆధిక్యంతో గెలుపొందారు. అతను 2019 జూన్ 2 నుండి జూన్ 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉపముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా భాధ‌తలు నిర్వహించారు. అతను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రి స్థాయికి,ఆపై ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. 2004-2006 మినహా 1989 నుంచి ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుండి అనేక పదవులు చేపట్టి పార్టీ జయాపజయాలలో కీలక పాత్ర పోషించిన రాజప్ప మొదటి నుండి పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేసారు. రాజప్ప విశ్వనీయత, సమర్ధతే ఆయనకు మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలలో భారీ విజయాన్ని అదించింది.

దీంతో పాటే ఆయనను నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ప్రభుత్వంలో రెండు కీలక పదవులు వరించాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, విపత్తు నివారణ శాఖా మాత్యులుగా కీలక పదవులు ఆయనకు లభించాయి. కోనసీమ ముద్దుబిడ్డగా, కీ.శే. బాలయోగి రాజకీయ వారసుడిగా కోనసీమతో పాటు తనకు ఇంతటి విజయాన్ని అందించిన పెద్దాపురం నిజయక వర్గం కూడా అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తాను అని ఇచ్చిన మాటకు… తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.