వ్య‌వ‌సాయ బిల్లుల‌తో రైతుకు తీవ్ర న‌ష్టం

-మాజీ మంత్రి అలీ ష‌బ్బీర్‌

కామారెడ్డిః వ్య‌వ‌సాయ బిల్లుల‌తో రైతుకు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. శుక్ర‌వారం కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్ లో గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. బడా కంపనీలతో ప్రధాని మోడీ కుమ్ముకయ్యార‌ని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు తీవ్రనష్టం జ‌రుగుతుంద‌ని తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కి గొడ్డలిపెట్టుగా, రైతాంగ సంక్షేమానికి తీవ్రమైన అవరోధంగా పరిణమించ బోతున్న వ్యవసాయ వ్యతిరేక బిల్లులను కేంద్ర ప్రభుత్వం వన్ ఉపసంహరించుకోవాలని ఆయ‌న కోరారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు వాటి నిలువలపై పరిమితులు విధించేది అని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్ రూపంలో ఉన్న మూడు వ్యవసాయ బిల్లులను ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి ఏకపక్షంగా ఆమోదించింద‌ని ఆరోపించారు. దాదాపు 18 ప్రతిపక్ష రాజకీయ పార్టీలతోపాటు బీజేపీ భాగస్వామ్య పక్షమైన ఆకాలిదల్ కూడా ఈ బిల్లులను వ్యతిరేకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసిందని గుర్తు చేశారు. . అయినా కూడా బీజేపీ ప్రభుత్వం దేశంలోని కోట్లాది రైతుల సంక్షేమాన్ని పణంగా పెట్టి తనకు మద్దతుగా ఉన్న కొంతమంది బడా కార్పొరేట్ వ్యాపారుల లాభాల కోసం ఈ బిల్లులను ఆమోదించిందని తెలిపారు. ఈ బిల్లులతో దేశంలో కోట్లాది రైతుల జీవితాలు చీకటిగా మారిపోతాయి. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి పోతుంది. కొద్దిమంది వ్యాపారుల లాభాపేక్ష కు, వారి వ్యాపార లబ్దికి పేద, చిన్న, సన్నకారు రైతుల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశంలో రైతులను చీకటిలోకి నెట్టేసి వ్యవసాయ రంగాన్నీ సంక్షోభంలో పడేసి వ్యాపారుల గుత్తాదిపత్యం కిందికి నెట్టి వేయడానికి ఈ మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు. ఈ నేప‌థ్యంలో మళ్ళీ భారత దేశ ప్రజలకు రెండోసారి స్వతంత్ర పోరాటం చెయ్యాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ప్రజల తరఫు నుండి అక్టోబర్ 2 నుండి సంతకాల సేకరణ ద్వారా ప్రజా పోరాటం మొదలు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొనాలని కోరారు.

కోరారు

Leave A Reply

Your email address will not be published.