విశాఖ కెజిహెచ్లో అరుదైన శస్త్రచికిత్స..

విశాఖపట్నం (CLiC2NEWS): టెండన్ ట్రాన్సఫర్ ఆపరేషన్ ప్రక్రియ ద్వారా చిన్నవయస్సులో చచ్చుబడిపోయిన కాళ్ళకు శస్త్రచికిత్స చేసి యథాస్థితికి తీసుకొచ్చారు కెజిహచ్ వైద్యులు. చిన్నవయస్సులోనే కుడికాలు నరాలు చచ్చుబడిపోయి వంకరగా మారిపోయిన 11 సంవత్సరాల పాపకు గత ఏడాది డిసెంబర్ 6న సర్జరీ చేశారు. ఈ టెండన్ ట్రన్సఫర్ సర్జరీ పూర్తయిన తర్వాత 30 నుండి 35 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపి చికిత్స అందించాలి. ఫిజియోథెరపి పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో రికవరీ అయినట్లు వైద్యుల తెలిపారు.
స్లాస్టిక్ సర్జన్ హెచ్వోడి, ఆంధ్ర మెడికల్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి. సుధాకర్ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. ఇలాంటి చికిత్సలు అరుదుగా విజయవంతమవుతాయని వైద్యుల పేర్కొన్నారు.