‘మ‌న ఊరు-మ‌న బ‌డి’లో భాగంగా 291 పాల‌శాల‌లు అభివృద్ది: మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ‘మ‌న ఊరు-మ‌న బ‌డి’ కార్య‌క్ర‌మం కింద మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని 291 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ప‌టిష్టం చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర ఎక్సైజ్‌, ప‌ర్యాట‌క శాఖామంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవ‌త్స‌రం నాటికి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మౌలిక స‌దుపాయ‌ల‌తో పాటు గుణాత్మ‌క‌మైన విద్య‌నందించాల‌నే ఉద్దేశ్యంతో  సిఎం కెసిఆర్ మ‌న ఊరు-మ‌న బ‌డి కార్య‌క్ర‌మం తీసుకొచ్చార‌న్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని పాఠ‌శాల‌ల‌ను సైతం తీర్చిదిద్దేందుకు ప్ర‌జాప్ర‌తినిధులు భాధ్య‌త తీసుకోవ‌ల‌న్నారు. ప్ర‌భుత్వం ఇచ్చే నిధుల‌తోపాటు పూర్వ విద్యార్థుల ద్వారా విరాళాలు సేక‌రించి పాఠ‌శాల‌ల్లో అన్ని వ‌స‌తులు స‌మ‌కూర్చాల‌న్నారు. గ‌తంతో పోలిస్తే వైద్య‌రంగంలో ప‌లు మార్పులొచ్చాయ‌ని, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ద్వారా కార్పొరేట్ విద్య‌ను అందించేందుకు కృషి చేస్తున్నార‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.